శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (09:06 IST)

#ITRaid : పిరికిపందను కాను... జైలుకెళ్లడం నాకు అలవాటే : దినకరన్

తనతో పాటు తన కుటుంబ సభ్యులు పిరికిపందలంకాదనీ, ఐటీ దాడులకు బెదిరిపోయేవాళ్లం అంతకంటేకాదనీ అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ స్పష్టంచేశారు. అదేసమయంలో తనకు జైలుకెళ్లడం చిన్నప్పటి నుంచి అలవాటేనని ఆయన

తనతో పాటు తన కుటుంబ సభ్యులు పిరికిపందలంకాదనీ, ఐటీ దాడులకు బెదిరిపోయేవాళ్లం అంతకంటేకాదనీ అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ స్పష్టంచేశారు. అదేసమయంలో తనకు జైలుకెళ్లడం చిన్నప్పటి నుంచి అలవాటేనని ఆయన తేల్చిచెప్పారు. కేవలం తనను, తమ కుటుంబ సభ్యులను రాజకీయాల నుంచి తప్పించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఐటీ దాడులు జరిపారని ఆయన ఆరోపించారు. 
 
గురువారం శశికళతో పాటు దినకరన్, వారి కుటుంబసభ్యులకు చెందిన 184చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెల్సిందే. ఈ దాడులపై ఆయన స్పందిస్తూ, 'నా రాజకీయ జీవితంలో ఇటువంటి దాడులు మూడు దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాను. వీటిని చూసి భయపడేది లేదు. ఈ దాడుల వెనుక కేంద్రం హస్తం ఉంది. ఐటీశాఖ కేంద్రం ఏజెన్సీగా పనిచేస్తుంది. నన్ను అరెస్టు చేస్తే.. నా మద్దతుదారులు పార్టీని ముందుండి నడిపిస్తారు' అని ప్రకటించారు. 
 
పన్ను ఎగవేసినట్లు ఆరోపణలతో పాటు డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు అన్నాడీఎంకే అధికారిక మీడియా సంస్థ జయ టీవీ కార్యాలయంతో పాటు శశికళ బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలోని మొత్తం 187 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.