ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (15:41 IST)

దెయ్యాలు బైకును నడుపుతాయా? వీడియో చూడండి..

మనుషులు బైకును నడిపి చూసేవుంటాం. అయితే దెయ్యాలు బైకును నడిపి చూశారా? అయితే ఈ స్టోరీ చదివి ఆపై వీడియో చూడండి. ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నగరానికి చెందిన ఓ మెయిన్ రోడ్డులో మనిషి లేకుండా ఓ బైకు తానంతట అదే

మనుషులు బైకును నడిపి చూసేవుంటాం. అయితే దెయ్యాలు బైకును నడిపి చూశారా? అయితే ఈ స్టోరీ చదివి ఆపై వీడియో చూడండి. ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నగరానికి చెందిన ఓ మెయిన్ రోడ్డులో మనిషి లేకుండా ఓ బైకు తానంతట అదే రోడ్డుపై వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
బైకు నడిపే వ్యక్తి లేకుండానే తానంతట అదే రోడ్డుపై దూసుకెళ్లడాన్ని చూసి నెటిజన్లంతా షాకవుతున్నారు. ఈ బైకు బ్యాటరీతో నడిచిందా లేకుంటే దెయ్యం ఏదైనా నడిపిందా అని నెటిజన్లు అనుమానిస్తున్నారు. కానీ ఈ బైకు మనిషి లేకుండా నడవడానికి అసలు కారణం ఏమిటనేది వెలుగులోకి వచ్చింది. 
 
సదరు బైకును నడిపిన వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. వేగంగా బైకును నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో వ్యక్తి కిందపడిపోవడంతో.. గియర్ మారలేదు. యాక్సిలేటర్‌ కూడా చక్కగా పనిచేయడంతో.. బైకు తానంతట అదే రోడ్డుపై దూసుకెళ్లింది.