శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (13:36 IST)

కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి.. ఆపై ముక్కలు ముక్కలుగా నరికి...

ఆమె కన్నతల్లి కాదు. కసాయి కంటే ఘాతుకురాలు. తన ప్రియుడుతో వరుసకు కుమార్తె అయిన యువతిపై అత్యాచారం చేయించింది. ఆ తర్వాత కుమార్తెను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. ఈ కేసులో కామాంధుడుకి కోర్టు ఉరిశిక్ష విధించింది. కసాయి తల్లికి జీవితఖైదు విధించింది. ఈ దారుణం అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెన్సిల్వేనియాకు చెందిన సారా, డేవిడ్ అనే దంపతులు అనాధ పిల్లలను దత్తత చేరదీసి పోషించే సంరక్షణా కేంద్రంలో పని చేస్తున్నారు. తమ సంరక్షణలో పెరిగిపెద్దవారైన అమ్మాయిలపై సారా భర్త డేవిడ్ అత్యాచారాలకు పాల్పడుతూ వచ్చేవాడు. 
 
అలా గ్రేస్ అనే అమ్మాయిపై డేవిడ్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకున్న గ్రేస్... పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... డేవిడ్‌ను అరెస్టు చేశారు. వాళ్లు అనాధలను దత్తత తీసుకొవద్దని కోర్టు హెచ్చరించింది. దీంతో గ్రేస్‌పై సారా పగ పెంచుకుంది.
 
అదేసమయంలో భర్త జైలుకు వెళ్లడంతో సారాకు మరో వ్యక్తితో పరిచయమైంది. అతని పేరు జాకబ్. అతనితో కలిసి వరుసకు కుమార్తె అయ్యే గ్రేస్‌ను హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక రోజు గ్రేస్‌ను జాకబ్ లైంగికంగా వేధించడమేకాకుండా అమ్మాయిని చేతులు, కాళ్లు కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. 
 
అనంతరం జాకబ్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. పిమ్మట ఆమెకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత అమ్మాయి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అనంతరం గ్రేస్ ఇంకా చనిపోవక పోవడంతో జాకబ్, సారా కలిసి అమ్మాయిని ముక్కలు, ముక్కలుగా నరికి ఊరు శివారులో పడేశారు. ఈ విషయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు విచారించి సారాతో పాటు ఆమె ప్రియుడు జాకబ్‌ను అరెస్టు చేయగా, కేసును విచారించిన కోర్టు.. జాకబ్‌కు ఉరిశిక్ష విధించింది. సారాకు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.