గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి.. ఆపై ఆత్మహత్య

విజయవాడలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త ఒకరు.. ఆమెను గొడ్డలితో నరికి చంపి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని జక్కంపూడి కాలనీకి చెందిన నరసింహా రావు(56), కృష్ణాకుమారి(47) అనే దంపతులు ఉన్నారు. వీరికి 25 యేళ్ల క్రితం వివాహమైంది. వీరి పిల్లలకు కూడా వివాహాలు జరిగాయి.
 
వీరి సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో భార్యపై భర్తకు అనుమానం మొదలైంది. దీంతో వారిద్దరి మధ్య రోజూ గొడవలు ప్రారంభమయ్యాయి. గత రెండు రోజుల క్రితం భార్యతో నరసింహా రావు గొడవపెట్టుకున్నాడు. దీంతో భార్య ఇంటిని తన అక్కగారింటికి వెళ్లింది. భార్యకు భర్త ఫోన్ చేసి క్షమించాలని కోరడంతో పాటు ఇంటికి రమ్మని కబురుపంపాడు. 
 
పైగా, భర్త ఇంటికి వచ్చేసరికి భార్య నిద్రలోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన భర్త.. గొడ్డలి తీసుకొని భార్య నుదిటిపై ఒక్క వేటు వేశాడు. ఈ దాడిలో భార్య ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నరసింహా రావు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనయుడు జాఘవా తలుపులు కొట్టినా ఎంతకు తీయకపోవడంతో బలవంతంగా తలుపులను తెరిచి చూసేసరికి ఇద్దరు చనిపోయి ఉన్నారు. జాఘవా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.