శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (12:13 IST)

ఉత్తరకొరియా రూమ్ నెం.39లో ఏముందో తెలుసా?

ఉత్తరకొరియాపై ఇప్పటికే ప్రపంచ దేశాలు గుర్రుగా వున్నాయి. ఆ దేశంపై పలు దేశాలు వాణిజ్య, ఆర్థిక పరమైన నిషేధాలు విధించాయి. ఇతర దేశాల నుంచి నిషేధాలు ఎదుర్కొన్నప్పటికీ ఉత్తర కొరియా యధేచ్ఛగా తన కార్యకలాపాలను

ఉత్తరకొరియాపై ఇప్పటికే ప్రపంచ దేశాలు గుర్రుగా వున్నాయి. ఆ దేశంపై పలు దేశాలు వాణిజ్య, ఆర్థిక పరమైన నిషేధాలు విధించాయి. ఇతర దేశాల నుంచి నిషేధాలు ఎదుర్కొన్నప్పటికీ ఉత్తర కొరియా యధేచ్ఛగా తన కార్యకలాపాలను చేసుకుంటూ పోతోంది.

ఇందుకు కారణంగా ఉత్తర కొరియాలోని రూమ్ నెం.39 అని వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియాలోని కార్మికుల పార్టీ కార్యాలయం లోపల గల రూమ్ నెంబర్ 39లో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారు.
 
అమెరికా డాలర్లను చట్ట వ్యతిరేకంగా ఉపయోగించడం ద్వారానే ఉత్తర కొరియాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం లేదు. చైనా బ్లాక్ మార్కెట్లో ఉత్తర కొరియా బ్లాక్ మనీ అమ్మబడుతోంది. ఇలాంటి చర్యల ద్వారానే ఉత్తర కొరియా ఆర్థిక పరంగా నిలదొక్కుకోగలుగుతుంది. 
 
ఇంకా ఈ 39 నెంబర్ గదిలో ఆ దేశాధినేత బుల్లెట్ ఫ్రూప్ పరికరాలతో పాటు అత్యాధునిక ఆయుధాలను కూడా భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఈ డబ్బుతోనే కిమ్ జాంగ్ తనకు ఇష్టమైన ఫ్రెంచ్ చీజ్‌తో పాటు రాయల్ ఫుడ్‌ను తీసుకుంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.