గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (09:49 IST)

బిన్‌లాడెన్ కుమారుడిని హతమార్చిన అమెరికా..

కరుడుగట్టిన ఉగ్రవాది బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన అమెరికా ప్రస్తుతం అతని వారసుడిని కూడా వదిలిపెట్టలేదు. ప్రస్తుతం అల్‌ఖైదా చీఫ్‌గా వున్న బిన్‌లాడెన్ కుమారుడు హామ్జా బిన్ లాడెన్‌ను అమెరికా హతమార్చింది.


రెండేళ్లుగా గాలిస్తున్న అమెరికా.. చివరికి అతనిని హతమార్చింది. ఇంకా హమ్జా మృతిపై మాట్లాడబోనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పేశారు. 
 
కానీ హమ్జాను హతమార్చినట్టు అమెరికా పత్రికలు ప్రకటించాయి. తండ్రి మృతి తర్వాత అల్ ఖైదా‌కు వారసుడిగా ఉన్న హమ్జా మృతికి సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని ఎన్‌బీసీ వార్తా సంస్థ వెల్లడించింది. హమ్జా మృతిని అమెరికా అధికారులు కూడా ధ్రువీకరించినట్టు తెలిపింది.  
 
2017లో హమ్జా బిన్ లాడెన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా అతడిపై మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలకు సవాలుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అగ్రరాజ్యం అమెరికా కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా బిన్ లాడెన్ కుమారుడిని హతమార్చింది.