ఆయనకు ముగ్గురు.. కానీ నాలుగోదాని కోసం అన్వేషణ.. పండుగ చేసుకుంటున్న పాక్ యువకుడు

youngman  with three wives
ఎం| Last Updated: ఆదివారం, 22 నవంబరు 2020 (19:12 IST)
ఇప్పటికే అతనికి ముగ్గురు భార్యలు. కానీ ఆ ముగ్గురూ కలిసి తమ భర్తకు నాలుగో భార్య కోసం వెతుకుతున్నారు.
మొత్తమ్మీద ఆ యువకుడు ఎంజాయ్ చేసుకుంటున్నాడు. ఇంతకీ ఈ వ్యవహారం గురించి తెలుసుకోవాలంటే మనం పాకిస్థాన్ వెళ్లాల్సిందే...

సియాల్‌కోట్‌కు చెందిన అద్నాన్‌ అనే వ్యక్తికి 16 సంవత్సరాల వయస్సున్నప్పుడే మొదటిసారి వివాహం అయ్యింది. మళ్లీ 20 ఏళ్ల వయసులో రెండోసారి వివాహం... గతేడాది మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం 22 ఏళ్ల అద్వాన్‌ నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ముగ్గురి భార్యల పేర్లు 'ఎస్‌'తోనే ప్రారంభమవుతాయి.

ఇక నాలుగో భార్య పేరు కూడా 'ఎస్‌'తోనే ప్రారంభమవ్వాలని సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారు. కాగా, మొదటి భార్యకు ముగ్గురు, రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో భార్య ఒకరిని దత్తత తీసుకున్నారు. అయితే ఎవరికైనా ముగ్గురు భార్యల మధ్య సఖ్యత ఉంటుందా? అనే అనుమానం రాకమానదు.

కానీ ఆ ముగ్గురి భార్యల మధ్య ఎంతో సఖ్యత ఉంటుందని... ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని సర్దుకుపోతారని అద్వాన్‌ అన్నారు. కాకపోతే ఆ భార్యలందరిదీ అయనపై ఏకైక ఫిర్యాదు ఏమిటంటే.. తమతో తగిన సమయం గడపడం లేదని భావిస్తారు.

ముగ్గురు భార్యలు తననెంతో ప్రేమగా చూసుకుంటారని.. తాను కూడా వారిని చాలా ప్రేమిస్తున్నానని అద్వాన్‌ తెలిపారు. ఇక కుటుబ పోషణ విషయానికొస్తే... నెలకు ఒకటిన్నర లక్షల రూపాయలు ఖర్చవతుందట. ఆరు బెడ్‌ రూములు, డ్రాయిగ్‌ రూమ్‌, స్టోర్‌ రూమ్‌ ఉన్న ఇంట్లో ఉంటానని వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :