శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (09:47 IST)

డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు.. పార్టీకెళ్లారు.. కారులోనే చనిపోయారు.. పిల్లలు అనాథలయ్యారు..

తల్లిదండ్రులు మత్తుమందులకు అలవాటు పడటంతో పసిపిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుది. వివరాల్లోకి వెళితే.. డేనియల్ (32), అతడి భార్య హెతర్ కెస్లీ (30) లు వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఒక పార్టీకి వెళ్లారు. అది ముగించుకుని అర్థరాత్రి ర

తల్లిదండ్రులు మత్తుమందులకు అలవాటు పడటంతో పసిపిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుది. వివరాల్లోకి వెళితే.. డేనియల్ (32), అతడి భార్య హెతర్ కెస్లీ (30) లు వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఒక పార్టీకి వెళ్లారు. అది ముగించుకుని అర్థరాత్రి రెండు గంటలకు ఇంటికి తిరిగివస్తున్నారు. భార్యాభర్తలిద్దరికీ మత్తుమందులు తీసుకునే అలవాటు ఉంది. ఇద్దరు ఫెన్‌టాలైన్ అనే మత్తుమందు తీసుకున్నారు. 
 
అప్పటికే వారు మందు తాగి ఇంటికి వెళ్తున్నారు. దానికి తోడు మత్తుమందు డోస్ ఎక్కువకావడంతో వారిద్దరూ కారులోనే మృతిచెందారు. కారు వెనుక సీట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు చెప్పారు. వారిలో ఇద్దరు కవలలున్నారు. వారి వయసు 2 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. మరోక బాలుడు చాలా చిన్నవాడని వారు అంటున్నారు.
 
అయితే ఆ సమయంలో వారు ముగ్గురు వెనుక సీట్లో నిద్రపోతున్నారని పోలీసులు తెలిపారు. మత్తు మందు డోసు ఎక్కువకావడం వల్ల ముందు స్పృహ కోల్పోయి ఉంటారని, తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్తున్నారు.