సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (12:08 IST)

క్వాడ్ సదస్సు : అమెరికా వెళ్లనున్న ప్రధాని మోడీ

అమెరికా వేదికగా క్వాడ్ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 24వ తేదీ అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడ జరుగనున్న క్వాడ్ సదస్సుతో పాటు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల అత్యున్నత సమావేశంలోనూ పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రధాని పర్యటనకు సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. 
 
కరోనా కారణంగా ఇన్నాళ్లూ ఆన్‌లైన్‌లోనే జరిగిన క్వాడ్ సమావేశాలు.. తాజాగా తొలిసారి ప్రత్యక్షంగా జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే సూగాలూ సమావేశాలకు హాజరవుతారు.
 
ఈ సదస్సులో భాగంగా క్వాడ్ వ్యాక్సిన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తారని భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న సమస్యలు, వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాలు, అనుసంధానత, మౌలిక వసతులు, సైబర్ సెక్యూరిటీ, తీర ప్రాంత రక్షణ, విపత్తు ఉపశమన సాయం, పర్యావరణ మార్పులు, విద్య వంటి వాటిపైనా చర్చిస్తారని పేర్కొంది.