సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (10:44 IST)

ఉన్నపళంగా ఖాళీ చేయిస్తున్న ఖతార్.. విదేశీ కార్మికులు షాక్

qatar
ప్రతిష్టాత్మక ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలకు ఖతార్ దేశం ఆతిథ్యమివ్వనుంది. ఇందుకోసం భారీస్థాయిలో ఏర్పాట్లుచేస్తుంది. ఆ దేశ రాజధాని దోహాలో ఈ క్రీడా పోటీలు జరుగనున్నాయి. అయితే, ఈ దేశంలో ఉన్న విదేశీ కార్మికుల మెడపై కత్తిపెట్టి, నోటీసులిచ్చిన రెండు గంటల్లో తమ నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. 
 
అలా ఖాళీ చేయని వారిని సామాన్లను రోడ్డుపై పడేశారు. రాత్రి వేళ అని కూడా చూడకుండా సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా కేవలం 2 గంటల ముందు నోటీసిలిచ్చి వెళ్లిపోవాలని వేధిస్తున్నారంటూ విదేశీ కార్మికులు వాపోతున్నారు. 
 
కాగా, నవంబరు 20వ తేదీ నుంచి దోహా వేదికగా ఫుట్‌బాల్ సమరం ప్రారంభంకానుంది. మ్యాచ్‌లను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షల మంది అభిమానులకు సరిపడ నివాసాలు లేకపోవడంతో ఖతార్ ప్రభుత్వం ఈ తరహా కఠిన చర్యలు చేపడుతోంది. 
 
ఇలా ఖాళీ చేయాల్సిన కార్మికుల్లో ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారే ఉండటం గమనార్హం. కాగా, ఖతార్ జనాభా 30 లక్షలు కాగా, 85 శాతం మంది విదేశీ కార్మికులో ఉన్నరు. వీరిలో ఎక్కువగా డ్రైవర్లు, దినసరి కార్మికులు, ఇతర పనులు చేసేవారే ఉన్నారు.