బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (16:48 IST)

బుడ్డోడు గట్టోడు... మారథాన్ సెషన్‌లో 3202 పుష్‌అఫ్స్

రష్యాకు చెందిన ఐదేళ్ళ బుడ్డోడు చాలా గట్టోడు. మారథాన్ సెషన్‌లో ఏకంగా 3,202 పుష్‌అప్స్ చేశాడు. తద్వారా ఆరు ప్రపంచ రికార్డులను బద్ధలకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
రష్యాకు చెందిన ఐదేళ్ళ రఖీం కురయెవ్ కిండర్ గార్డెన్‌ చదువుతున్నాడు. కానీ, చాలా గట్టోడు. ఎంతలా గట్టోడు అంటే ఏకంగా 3202 పుష్‌అప్స్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
ఈ ఐదేళ్ల చిన్నోడు 40 నిమిషాల 57 సెకండ్లలో 1,000 పుష్‌అప్స్, గంటా 30 నిమిషాల్లో 2,000 పుష్‌అప్స్, మారథాన్ సెషన్‌లో 3,202 పుష్‌అప్స్ చేసి.. మొత్తం ఆరు ప్రపంచ రికార్డులను కైవసం చేసుకున్నాడు. దీంతో బుడ్డోడు మెర్సెడిస్ బెంజ్‌తో పాటు టాయ్స్ షాప్‌కు ట్రిప్‌ను గెలుచుకున్నాడు.