శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (09:20 IST)

బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక కావడం అతి గొప్ప గౌవరం : రిషి సునక్

rishi sunak
బ్రిటన్ దేశ ప్రధానమంత్రిగా రిషి సునక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన తొలిసారి స్పందించారు. బ్రిటన్ దేశ ప్రధానిగా ఎన్నిక కావడం అతిగొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. అదేసమయంలో తనపై నమ్మకం ఉంచి దేశ ప్రధానిగా ఎన్నుకున్న అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేసమయంలో ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. కన్జర్వేటివ్ సభ్యులు తనపై నమ్మకం ఉంచడాన్ని నాకు లభించిన గౌరవంగా భావిస్తాను. వారి ఆదరణ తనను మంత్రుగ్ధుడ్ని చేసింది. తనకెంతో ఇచ్చిన ఈ దేశానికి తిరిగిచ్చే భాగ్యం తనకు దక్కింది. పార్టీకి కూడా శక్తివంచన లేకుండా సేవలు అందిస్తాను అని సునాక్ పేర్కొన్నారు. 
 
గ్రేట్ బ్రిటన్ ఒక గొప్ప దేశం అని, కానీ ఇపుడు అత్యంత క్లిష్టమైన ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటుందన్నారు. ఇపుడు మనకు కావాల్సింది స్థిరత్వం, ఐకమత్యం అని రిషి పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం తన ముందున్న ఏకైక కర్తవ్యం పార్టీని, దేశాన్ని సంయుక్తంగా ముందుకు తీసుకెళ్లడమేనని, మన పిల్లలు, వారి పిల్లలు ఘనమైన భవిష్యత్తును అందించే క్రమంలో సవాళ్లను అధికమించేందుకు ఇదొక్కటే మార్గమని రిషి సునక్ స్పష్టం చేశారు.