ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 9 జులై 2024 (22:41 IST)

ప్రధానమంత్రి నరేంద్ర మోడికి రష్యా అత్యున్నత పౌర గౌరవం (Video)

Russia's highest civilian honor for Prime Minister Narendra Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోడికి మంగళవారం నాడు క్రెమ్లిన్‌లో రష్యా అత్యున్నత పౌర గౌరవమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌ను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అందించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా, ప్రధాని మోదీ వ్లాదిమిర్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడుతూ, ఉక్రెయిన్ వివాదానికి యుద్దభూమిలో పరిష్కారం సాధ్యం కాదని అన్నారు.
 
బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని చెప్పారు. కీవ్‌లోని పిల్లల ఆసుపత్రిపై దాడిపై మాట్లాడుతూ... అమాయక బాలలు మరణించడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. క్రెమ్లిన్‌లో పుతిన్‌తో జరిగిన సమావేశంలో ఆయన టెలివిజన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల రష్యా పర్యటనకై మోడి రష్యా వెళ్లారు. రష్యా లోని భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, 'మోడీ-మోడీ' నినాదాల మధ్య రష్యాను 'భారతదేశం యొక్క ఆల్-వెదర్ ఫ్రెండ్' అని చెప్పారు.
 
స్నేహితుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సహకారం అన్ని అంశాలను సమీక్షించడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధాని మోడి చెప్పారు. శాంతియుత, సుస్థిరమైన ప్రాంతం కోసం ఇద్దరు నాయకులూ సహాయక పాత్ర పోషించాలని కోరుతారని ఆయన అన్నారు. ఫిబ్రవరి 2022లో మాస్కో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి.