బురఖాను నిషేధించిన శ్రీలంక.. కారణం ఏంటంటే?
ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఇప్పటికే బురఖాను ధరించడాన్ని నిషేధించారు. తాజాగా శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే గతంలోనూ ఒకసారి శ్రీలంక ప్రభుత్వం బురఖాను ధరించడాన్ని నిషేధించింది. అప్పట్లో 2019వ సంవత్సరంలో బౌద్ధ ప్రార్థనా మందిరాలపై తీవ్ర వాదులు దాడులు జరిపి 250 మందిని బలి తీసుకున్నారు. దీంతో అప్పట్లో తాత్కాలికంగా బురఖాపై నిషేధం విధించారు. కానీ ఇకపై దాన్ని శాశ్వతం చేయనున్నారు.
ఇకపై ఆ దేశంలో బురఖాను ధరించడాన్ని నిషేధించనున్నారు. ఈ మేరకు అక్కడి ఇస్లామిక్ పాఠశాలలు, మదరసాలలో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రీలంక పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ శరత్ వీరశేఖర మీడియాతో మాట్లాడుతూ బురఖాను ధరించడాన్ని నిషేధించనున్నట్లు తెలిపారు. దీని వల్ల దేశంలో భద్రత మెరుగవుతుందని తెలిపారు.