శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (10:10 IST)

ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు

earthquake
ఇండోనేషియాలో వరుస భూకంపాలు జనాలను వణికిస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలోని ఉత్తరాన అచే ప్రావిన్స్‌లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది.
 
శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం 6.2 తీవ్రతగా అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున భూకంపం సంభవించినప్పుడు ప్రజలు తమ ఇళ్ల నుండి ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. 
 
ఈ భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. సముద్రగర్భంలో భూకంపం రావడంతో సునామీ ముప్పు ఉందన్న ఆందోళన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అయితే, సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు.