గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (12:52 IST)

వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళకు బెత్తం దెబ్బలు.. బాధతో ఏడుస్తుంటే?

ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తారు. దాని ప్రకారం జూదం ఆడినా, మద్యం తాగినా, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఈ నే

ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తారు. దాని ప్రకారం జూదం ఆడినా, మద్యం తాగినా, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా, స్వలింగ సంపర్కానికి పాల్పడినా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వేరే పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఇండోనేషియాలో ఓ మహిళను బహిరంగంగా బెత్తంతో కొట్టారు. బాధతో ఆమె విలవిల్లాడుతూ గట్టిగా ఏడుస్తుంటే.. చుట్టున్నోళ్లంతా వినోదం చూస్తూ ఉండిపోయారు. 
 
తాజాగా ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులను వివిధ నేరాల కింద పట్టుకున్న అధికారులు.. రాష్ట్ర రాజధాని అయిన బందా అసె ప్రాంతంలో ఓ మసీదు వద్ద అందరూ చూస్తుండగా బెత్తంతో దెబ్బలు కొట్టారు. 19 ఏళ్ల వయసున్న ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు కూడా పెళ్లి కాకుండానే లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు వారికి 100 చొప్పున బెత్తం దెబ్బల శిక్ష పడింది. 
 
మరోవ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు అతడికి 22 దెబ్బలు పడ్డాయి. అతడి భాగస్వామి గర్భవతి కావడంతో.. ఆమెకు ఇంకా ఏశిక్ష విధించేదీ చెప్పలేదు. వీరిలో 34 ఏళ్ల మహిళ తన భర్త కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తీవ్రంగా కొట్టారు. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించిన వ్యక్తికి కూడా ఏడు దెబ్బల శిక్ష విధించారు.