గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:49 IST)

సూపర్‌ షీ ఐలాండ్‌.. స్త్రీలకు మాత్రమే

ఫిన్‌లాండ్‌ తీరప్రాంతంలో 8.4 ఎకరాల్లో 'సూపర్‌ షీ' అనే ఓ ఐలాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఐలాండ్‌లోకి స్త్రీలకు మాత్రమే అనుమతి ఉంది. పురుషులకు అనుమతి లేదు. ఇదే అక్కడి ప్రత్యేకత.

వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమే. అమెరికాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త క్రిస్టినా రోత్‌ సూపర్‌ షీ ఐలాండ్‌కు యజమాని. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ రిసార్టు ఏర్పాటు చేయాలని భావించిన ఆమె ఈ ఐలాండ్‌లో ఓ రిసార్టు ఏర్పాటు చేసి కేవలం స్త్రీలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

వారి కోసం అక్కడ ప్రత్యేక గదులు, స్పా, అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌ వంటివి ఉన్నాయి. రకరకాల వంటలను కూడా వండి పెట్టడానికి ప్రత్యేకంగా వంట మనిషి కూడా ఉంది. అంతే కాదు పర్యాటకులే స్వయంగా వండుకునే సదుపాయం కూడా ఉంది.

యోగ, ధాన్యం చేయించే క్లాసులూ ఉంటాయి. ఈ సూపర్‌ షీ ఐలాండ్‌లో మొదట్లో క్రిస్టినా, ఆమె స్నేహితులు మాత్రమే సేద తీరేందుకు వెళ్లేవారు. ఆ తరువాత దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చేశారు. బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు ఎవరైనా సరే కనీసం పది మంది కలిసి బృందంగా బుక్‌ చేసుకోవచ్చు.

స్త్రీలు కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లినా, ఉద్యోగులతో వెళ్లినా వారికి అంతగా స్వేచ్ఛ ఉండదని భావించిన క్రిస్టినా వారి కోసం ప్రత్యేకంగా ఈ ఐలాండ్‌ రిసార్టు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.