గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (20:12 IST)

కళ్ల ముందే సోదరి చనిపోతోంది.. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో చూపించింది...

కళ్ల ముందే సోదరి ప్రాణాలు కోల్పోతున్న ఘటనను ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‍‌లో పోస్ట్ చేసింది. తాను నడుపుతున్న కారును ప్రమాదానికి గురి చేయడమే కాకుండా.. తన సోదరి మృతి చెందనున్న ఘోరాన్ని వీడియో ద్వారా పోస్ట్ చే

కళ్ల ముందే సోదరి ప్రాణాలు కోల్పోతున్న ఘటనను ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‍‌లో పోస్ట్ చేసింది. తాను నడుపుతున్న కారును ప్రమాదానికి గురి చేయడమే కాకుండా.. తన సోదరి మృతి చెందనున్న ఘోరాన్ని వీడియో ద్వారా పోస్ట్ చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 18 ఏళ్ల సాంచెజ్ కాలిఫోర్నియా హైవేపే కారు నడుపుతున్న సందర్భంగా కారు అదుపు తప్పింది. 
 
ఆ సమయంలో కారులో ఆమె సోదరి జాక్విలిన్ (14)తో పాటు మరో టీనేజ్ అమ్మాయి కూడా ఉంది. కారు తీవ్ర ప్రమాదానికి గురై పల్టీ కొట్టడంతో జాక్వెలిన్, మరో టీనేజ్ అమ్మాయి కారులో నుంచి ఎగిరి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో జాక్వెలిన్ తీవ్రంగా గాయపడింది. ఆమె తల నుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నప్పటికీ.. తన సోదరి మరణిస్తున్న దృశ్యాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో చూపించింది. 
 
ఆమెను చంపాలని తాను అనుకోలేదని, అయినా, ఆమె చనిపోతోందని స్ట్రీమింగ్ సందర్భంగా ఆమె చెప్పింది. కాసేపటికే జాక్వెలిన్ మరణించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై జాక్వెలిన్ తండ్రి ఆవేదన వెల్లగక్కారు. తన పెద్ద కూతురే తన చిన్న కూతుర్ని పొట్టనబెట్టుకుందని చెప్పాడు. జాక్వెలిన్ ఏదో తప్పు చేసిందని, అందుకు సొంత చెల్లిని ఆమె చంపేసిందని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.