సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (11:14 IST)

మేకను చంపిన ఫేస్‌బుక్ ఫౌండర్ జుకర్ బర్గ్... ఎందుకు?

సోషల్ మీడియా ప్రచార వేదికల్లో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ సంస్థలకు దిగ్గజాలుగా ఉన్న సీఈఓలు డిన్నర్ పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీ ఎలాంటిదంటే.. మేకను చంపిమరీ డిన్నర్ పార్టీ చేసుకున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.. ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్. ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే. మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా జార్ డోర్సోకు ట్వీట్ ఇచ్చాడట. అది తన జీవితంలో మర్చిపోలేని అనుభూతని చెప్పుకొచ్చాడు. రోలింగ్ స్టోన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు.
 
"ఇది దాదాపు ఏడాది క్రితం జరిగింది. ఓ రోజు జుకర్ బర్గ్ డిన్నర్‌కు పిలిచాడు. భోజనానికి కొద్దిసేపటి ముందు స్టన్‌గన్ పట్టుకుని మేక మీద అటాక్‌కు బయలుదేరాడు జుకర్. లేజర్ స్టన్ గన్‌తో దాన్ని షూట్ చేయగానే పడిపోయింది. ఆ తర్వాత కత్తితో దాని మెడ కోసి.. మేక మాంసం కొట్టే వాడి దగ్గరకు పంపాడు. ముక్కలు రాగానే ఒవెన్‌లో దాన్ని వండాడు. అయినా అది చల్లగానే ఉంది. అసలు విషయం ఏంటంటే నేను మేక మాంసం తినను' అని నవ్వుతూ చెప్పాడు జాక్. అప్పుడు జుకర్ బర్గ్ పరిస్థితి చూడాలీ… అంటూ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆ తర్వాత తాను ఫ్రూట్ సలాడ్ తిని డిన్నర్ ముగించానని చెప్పారు. అదే జుకర్ బర్గ్‌తో తనకు జీవితంలో మర్చిపోలేని అదే మోస్ట్ మెమొరబుల్ అనుభవం అదేనని చెప్పాడు.