బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (16:15 IST)

మాట్లాడడం ఒక కళ.. దాన్ని ఎలా పెంపొందించుకోవాలి...?

కొందరైతే చూడడానికి అందంగా బాగుంటారు. కానీ, ఎవ్వరితో అంతగా మాట్లాడరు. 10 మందిలో ఉన్నప్పుడు అలా ఉండడం అంత మంచిది కాదు. వీలైనప్పుడల్లా పక్కనున్నవారితో లేదా అలా కాస్త తిరుగుతూ ఉండాలి. అప్పుడే మీ గురించి అందరికి తెలుస్తుంది. అలానే మీరు మాట్లాడే ప్రతిమాట వారికి అర్థమైయ్యేలా ఉండాలి. కానీ, ఇతరులను కష్ట పెట్టే విధంగా ఉండకూడదు. మాట్లడడం ఒక కళైతే.. దాన్ని ఎలా పెంచుకోవాలనేది ఒక కళ.. అందుకు ఏం చేయాలంటే..
 
మీరు మాట్లాడటమే కాదు, ఎదుటివారు చెప్పేవి కూడా వినాలి. విసుగు కలిగించినా, మధ్యలో వారు చెప్పేదాన్ని ఆపండి అనవద్దు. ఎంతటి ఉద్రేక పూరిత విషయమైనా కంగారుగా చెప్పవద్దు. వీలైనంత ప్రశాంతంగా చెప్పండి. ఎదుటివారు మీకు తెలియని కొత్త విషయాలు చెబుతున్నారేమో గమనించండి. మీ కంఠస్వరం మొరటుగా ఉంటే మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నించి అలవాటు చేసుకోవాలి.
 
మీకు ఆసగా మాట్లాడడం, ఊత పదాలు మాట్లాడడం అలవాటు ఉంటే క్రమంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఎదుటివారు ఇష్టపడని అంశాలను మాట్లాడకూడదు. ఎదుటివారికి అర్థం కాని విషయాలను మాట్లాడవద్దు. మీరేం చెప్పదల్చుకున్నారో స్పష్టంగా అర్థమయ్యేటట్లు వివరించండి. ఎదుటివారు బాధపడేటట్లుగా ప్రత్యక్షంగా అంశాన్ని ప్రస్తావించవద్దు. ముందుగా ఆలోచించకుండా అనవసరమైన వాదనకు దిగవద్దు. 
 
ఎవరి గురించైనా విమర్శించేటప్పుడు ఆ సంభాషణ నోట్లో నుండి బయటకు రాకుండా కనీసం 10 నిమిషాలు గడువిచ్చి మాట్లాడండి. ఇతరుల అభిరుచలను, వారి ప్రవర్తనను మరింత నిశితంగా పరిశీలించాలి. మీరు కొంత సేపు మాట్లాడిన తర్వాత ఎదుటివారు కూడా మాట్లాడానికి అవకాశం ఇవ్వాలి. ఎదుటివారికి ఆసక్తి కలిగించే విషయాలపై ఎక్కువగా మాట్లాడకూడదు.