బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (18:00 IST)

భారతదేశానికి తాలిబన్లతో పెద్ద సవాల్..ఏంటది?

భారతదేశానికి తాలిబన్లతో పెద్ద సవాల్ పొంచి వుంది. ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో చారిత్రకంగా ఉన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో, ఈ రెండు దేశాలూ తాలిబాన్లకు మిత్రదేశాలు కావడం భారతదేశానికి సమస్యలు సృష్టించవచ్చు. భవిష్యత్తులో అఫ్గానిస్తాన్ ఆర్థిక, రాజకీయ అంశాల్లో పాకిస్తాన్, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య సరిహద్దు చాలా సంక్లిష్టమైంది. ఆ సరిహద్దు వెంబడి చాలా చోట్ల రాకపోకలకు ఆస్కారమిచ్చే దారులున్నాయి. అంతే కాకుండా, చాలాకాలం నుంచి అఫ్గానిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ చురుకుగా జోక్యం చేసుకుంటూ ఉంది. పాకిస్తాన్, రష్యా, ఇరాన్, చైనాలు కలిసికట్టుగా ఈ రాజకీయ ఆటలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
అఫ్గానిస్తాన్‌లో సంభవిస్తున్న తాజా పరిణామాలు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇండియాలో కొందరు ఈ పరిణామాలను దేశానికి నష్టాన్ని కలిగించేవిగానూ, పాకిస్తాన్‌కు లాభాన్ని కలిగించేవిగానూ పరిగణిస్తున్నారు.