ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (07:03 IST)

చోరీకి విశ్వప్రయత్నం... గాజు తలుపు బ్రేక్ చేయలేక పలాయనం (Video)

ఓ నగల దుకాణంలో ఆభరణాలను చోరీ చేయాలని వచ్చిన ముగ్గుర దొంగలకు ఓ గాజు తలుపు అడ్డుపడింది. ఈ తలుపును పగులగొట్టలేక వారు తోకముడిచి వెనుదిరిగారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఇది చోటుచేసుకుంది. తాజాగా వెలుగ

ఓ నగల దుకాణంలో ఆభరణాలను చోరీ చేయాలని వచ్చిన ముగ్గుర దొంగలకు ఓ గాజు తలుపు అడ్డుపడింది. ఈ తలుపును పగులగొట్టలేక వారు తోకముడిచి వెనుదిరిగారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఇది చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మెల్‌బోర్న్‌లోని ఓ నగల ఆభ‌ర‌ణాల‌ షోరూంలో దొంగ‌త‌నం చేయ‌డానికి ముగ్గురు దొంగ‌లు వ‌చ్చారు. సుత్తెలు ప‌ట్టుకొని షోరూం గాజు త‌లుపు బ‌ద్ద‌లు కొట్ట‌డానికి తీవ్రంగా ప్రయత్నించారు. ముగ్గురు క‌లిసి త‌మ సుత్తుల‌తో త‌లుపును బాద‌డం ప్రారంభించారు. 
 
ఎన్ని సార్లు కొట్టినా చీలిక‌లు ప‌డుతోందే త‌ప్ప గాజు ప‌గ‌ల‌డం లేదు. కాలితో త‌న్నారు, కోపంగా సుత్తుల‌తో దాడి చేశారు, అయినా ఎలాంటి ప్ర‌యోజనం లేక‌పోవ‌డంతో తోక‌ముడిచి, అక్క‌డి నుంచి పారిపోయారు. జూన్ 5న జ‌రిగిన ఈ దొంగ‌త‌నం సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు ఇటీవ‌ల విడుద‌ల చేశారు. త‌లుపు ప‌గ‌ల‌గొట్ట‌డానికి దొంగ‌లు ప‌డుతున్న కష్టాన్ని మీరూ చూడండి.