శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (10:58 IST)

ఎన్నికల్లో గెలుపు కంటే నిజం చెప్పి ఓడిపోవడమే మంచిది : వివేక్ రామస్వామి

vivek ramaswamy
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిజం చెప్పి ఓడిపోవడమే మంచిదని వివేక్ రామస్వామి అన్నారు. వచ్చే యేడాది జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా, ఆయన ఐయోనా రాష్ట్రంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల నుంచి వివిధ రకాలైన ప్రశ్నించారు. ఒక హిందువు అమెరికా అధ్యక్షుడు కాలేరు అంటూ ఓ ఓటరు ప్రశ్నించాడు. దీనికి వివేక్ రామస్వామి తనదైనశైలిలో బదులిచ్చి ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకున్నారు. 
 
ఆ ఓటరు అడిగిన ప్రశ్నకు వివేక్ సమాధానమిస్తూ, "ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోతున్నా. ఎన్నికల్లో గెలుపు కంటే నిజం చెప్పి ఓడిపోవడమే నయమని నేను అనుకుంటున్నా. నేను హిందువుని. చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూళ్లల్లో చదువుకున్నా. రెండు మతాల్లోనూ ఒకే తరహా విలువలు ఉన్నాయని నేను నమ్మకంగా చెబుతున్నా. దేవుడు ప్రతి ఒక్కరిని ఓ కారణంతో ఈ భూమ్మీదకు పంపించాడని నా మతం చెబుతోంది. 
 
ఈ బాధ్యతను నిర్వర్తించాల్సిన నైతిన బాధ్యత మనందరిపైనా ఉంది. దేవుడు మనందరిలో ఉన్నాడు కాబట్టి మనుషులందరూ సమానమే. భగవంతుడు ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగిస్తాడు. దైవసంకల్పం మనం పాటించాల్సిందే. అందుకే మొదట ఓల్ట్ టెస్టమెంట్ వచ్చింది. ఆ తరువాత బుక్ ఆఫ్ ఇసాయా. ఆ సందర్భంలో దేవుడు సైరస్కు యూదులను తమ పవిత్ర ప్రాంతానికి తరలించే అవకాశం ఇచ్చాడు. కాబట్టి, దేవుడు నాకూ ఓ లక్ష్యం ఇచ్చాడని నమ్ముతున్నాను. ఆ నమ్మకమే నన్ను అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేలా చేసింది అని వివేక్ చెప్పుకొచ్చాడు.