శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (13:30 IST)

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయనున్న భారత సంతతి వ్యక్తి

Ramasamy
Ramasamy
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరో భారత సంతతి వ్యక్తి సిద్ధమవుతున్నారు. ఇండియన్-అమెరికన్ వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ నేత రామస్వామి పార్టీ ప్రైమరీ ఎన్నికల రేసులో పాల్గొంటారని ప్రకటించారు.

వచ్చే ఏడాది జనవరిలో జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన వారికే అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ తరపున పోటీకి దిగే అవకాశం దక్కుతుంది. 
 
ఇప్పటికే పార్టీ తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, మరో నేత నిక్కీ హేలీ బరిలో వున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో తరఫున రెండో భారత సంతతి అభ్యర్ధిగా రామస్వామి నిలుస్తారు. ఈయనకు 37 సంవత్సరాలు. 
 
ఓహాయోలో జన్మించారు. భారత్‌లో ఆయనది స్వస్థలం కేరళ. రామస్వామి 2007లో హార్వర్డ్ కాలేజీలో జీవశాస్త్రంలో డిగ్రీ పొందారు. 2014లో బయోటెక్‌ సంస్థ రోయివంట్‌ సైన్సెస్ స్థాపించారు. 2015, 2016 సంవత్సరాల్లో అతిపెద్ద బయోటెక్‌ ఐపీవోలకు నేతృత్వం వహించారు. పలు టెక్నాలజీ సంస్థలనూ నెలకొల్పారు.