గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (11:21 IST)

తజకిస్థాన్‌లో భారీ భూకంపం - భూకంపలేఖినిపై 6.8గా నమోదు

earthquake
సెంట్రల్ ఆసియా దేశాల్లో ఒకటైన తజికిస్థాన్‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. ఇది భూకంప లేఖినిపై 6.8గా నమోదైంది. అయితే, చైనా మాత్రం తూర్పు తజికిస్థాన్‌లో 7.2గా తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తెలిపింది. భూకంప కేంద్రాన్ని చైనా, ఆప్ఘనిస్థాన్‌లకు దాదాపు 67 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. 
 
బుధవారం తెల్లవారుజామున 5.37 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. గోర్నో - బదక్షన్ ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 
 
ఆ తర్వాత మరో 20 నిమిషాల వ్యవధిలో 5.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్టు పేర్కొంది. అయితే, ఈ భూకంపం కారణంగా సంభవించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నది సమాచారం.