సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (15:19 IST)

ఢిల్లీ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు

earthquake
ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవిచాయి. బుధవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించగా, ఇవి రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. 
 
ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయిని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రాన్ని ఉత్తరాఖండ్‌ ఫితోరాగఢ్‌లో పది కిలోమీటర్ల లోతన గుర్తించినట్టు వారు తెలిపారు. 
 
అయితే, ఈ  భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ఇదిలావుంటే, బుధవారం ఉదయం పొరుగు దేశమైన నేపాల్‌లో భూకంపం సంభవించింది. దీని ప్రభావం ఉత్తరాఖండ్, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించాయని వారు అభిప్రాయపడుతున్నారు.