శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (15:34 IST)

ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు

earthquake
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భూకంపం ఏర్పడింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. అలాగే భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం 2.28 గంటలకు నేపాల్ లో భూకంపం ఏర్పడింది. ఢిల్లీలో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8 గా నమోదైంది. 
 
దాని ప్రభావంతోనే ఢిల్లీలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఢిల్లీలో తరచుగా భూమి కంపిస్తోంది. జనవరి 5న ఆప్ఘన్ లో భూమి కంపించింది. 
 
ఈ ప్రభావంతో భూకంపం ఏర్పడింది. ఈ ప్రభావం ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లలో భూమి కంపించిన ప్రభావం కనిపించింది. సరిహద్దు ప్రాంతాలలో ఏర్పడే భూకంపాలతో ఢిల్లీలో అప్పుడప్పుడు భూమి కంపిస్తోందని తెలుస్తోంది.