గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (11:14 IST)

సంగారెడ్డిలో భూప్రకంపనలు... పరుగులు పెట్టిన జనం

earthquake
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో భూప్రకంపనలు కనిపించాయి. కోహిల్ మండలం బిలాల్‌పూర్‍‌లో భూమి ఒక్కసారిగా కంపించగానే జనం ఉలిక్కిపడుతూ పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ భూప్రకంపనలు మంగళవారం వేకువజామున 3.20 గంటల సమయంలో సంభవించగా, ఇవి రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో నమోదయ్యాయి. నల్గొండకు 117 కిలోమీటర్ల దూరంలోనూ, భూగర్భంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గతంలో జనవరిలోనూ కోహిర్ మండలంలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు కనిపించిన విషయం తెల్సిందే.