శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 23 నవంబరు 2022 (11:05 IST)

మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం. భూకంప లేఖినిపై 3.8గా నమోదు...

earthquake
మహారాష్ట్రలోని నాసిక్‌లో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. అలాగే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవి కనిపించాయి. భూకంప లేఖినిపై వీటి తీవ్రత 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. బాసర్‌‍కు 58 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్టు తెలిపింది. 
 
గోదావరి నది జన్మస్థలమైన నాసిక్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నాసిక్‌కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు భూ ఉపరితలం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల భూమికి దిగువున 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని తెలిపారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.