గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (14:12 IST)

డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శనంలో మార్పు.. 8 గంటలకే..?

tirumala
డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శన సమయాలను మార్చాలని టీటీడీ నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాల వల్ల తరచూ సామాన్య భక్తుల దర్శనానికి ఆటంకం కలుగుతోంది. ప్రస్తుతానికి వీఐపీ బ్రేక్ దర్శనాలను సోమవారం ఉదయం 5 గంటల నుంచి 5.45 వరకూ నిర్వహిస్తున్నారు. 
 
డిసెంబర్ 1 నుంచి వీఐపీ దర్శన సమయాలను మార్చాలని తిరుమల నిర్ణయించింది. నెలపాటు ఉదయం 8 గంటలకే బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తుంది. 
 
మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 6.30 నుంచి 7వరకూ నిర్వహిస్తున్నారు. తాజా మార్పుతో.. నెలపాటూ.. అన్ని రోజులూ ఉదయం 8 గంటలకే నిర్వహించడం వల్ల.. సామాన్య భక్తులు.. ముందుగానే స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుంది.