1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (18:07 IST)

శబరిమలలో మకరజ్యోతి యాత్ర.. నవంబర్ 16 నుంచి ప్రారంభం

sabarimala
శబరిమలలో మకరజ్యోతి యాత్ర నవంబర్ 16 సాయంత్రం ప్రారంభం కానుంది. శబరిమలలో మండల పూజ కోసం నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు శబరిమల ఆలయాన్ని తెరిచే వుంచుతారు. డిసెంబర్ 27న శబరిమల ఆలయ నడక మార్గాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
 
శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం 13 కేంద్రాలలో స్పాట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం వివిధ జిల్లాల్లో స్పాట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 
శబరిమల మకరజ్యోతి ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 30 సాయంత్రం నడకను తెరుస్తామని దేవస్థానం బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14న మకర జ్యోతి ఉత్సవాల తర్వాత మూసివేస్తామని దేవస్థానం తెలిపింది. అలాగే జనవరి 20న శబరిమల ఆలయ నడకను మూసివేస్తామని అధికార యంత్రాంగం తెలిపింది.
 
శబరిమల దర్శనానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ట్రావెన్‌కోర్ దేవసం బోర్డు చైర్మన్ అనంత గోపన్ ప్రకటించారు. అలాగే రిజర్వేషన్ లేకుండా వచ్చే భక్తులు నిలక్కల్‌లో 16వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని తెలియజేశారు.