శుక్రవారం, 14 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 నవంబరు 2022 (16:51 IST)

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 382 పోస్టుల భర్తీ

Jobs
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మంజూరైన 382 పోస్టుల్లో 367 రెగ్యులర్ పోస్టులు కాగా, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతినిచ్చారు. 
 
ఈ కొత్త పదిహేను ఫైర్ స్టేషన్లతోపాటు 382 పోస్టులను కూడా మంజూరు చేస్తూ జీవో కూడా విడుదలైంది. కాగా తెలంగాణలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసన సభ నియోజక వర్గాల్లో ఈ కొత్త ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.