శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

మేఘాలయాలో భూప్రకంపనలు - రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదు

earthquake
ఈశాన్య భారతం వరుస భూకంపాలతో వణికిపోతోంది. బుధవారం అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో భూప్రకంపనలు కనిపించాయి. గురువారం మేఘాలయ రాష్ట్రంలో భూకంపం సభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. 
 
గురువారం తెల్లవారుజామున 3.46 గంటల సమయంలో మేఘాలయ రాష్ట్రంలోని తురాలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రాన్ని తురాకు 37 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్టు తెలిపారు. భూపొరల్లో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. 
 
కాగా, బుధవారం 7 గంటలకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బాసరలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇది రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా ఉంది. అంతకుముందు మహారాష్ట్రలో నాసిక్‌లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి  కంపించిన విషయం తెల్సిందే. ఇది రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది.