ఢిల్లీలో సెకన్ల పాటు భూప్రకంపనలు- రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు
దేశ రాజధాని నగరం ఢిల్లీని ఇప్పటికే వాయు కాలుష్యం వేధిస్తోంది. చలి, వర్షాలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా భూకంపం ఢిల్లీ ప్రజలను వణికించింది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా బలమైన ప్రకంపనలు వచ్చాయి.
దీంతో ఒక్కసారిగా ఇంటి నుంచి జనం రోడ్లపైకి పరుగులు తీశారు. దాదాపు సెకన్ల పాటు తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయి. నోయిడా, గురుగ్రామ్ సహా పలుచోట్ల ప్రకంపనలు రికార్డయ్యాయి.
గత నాలుగు రోజుల్లో దేశ రాజధాని ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండోసారి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.