గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే జీవిత కారాగారమే... ఎక్కడ?

pushkar singh dhami
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే వివిధ రకాల రాత పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి జీవితకారాగార శిక్ష విధించేలా కఠిన నిర్ణయం తీసుకుంది. ఇటీవలికాలంలో ఆ రాష్ట్రంలో నిర్వహించిన అనేక పోటీ పరీక్షలకు సంబంధించిన రాతపరీక్షల్లో పలు అక్రమాలు జరిగాయి. 
 
ఈ కారణంగా ఈ రాతపరీక్షలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. పైగా, రిక్రూట్మెంట్స్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను కూడా తీసుకునిరాగా, దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోదముద్రవేశారు. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి జీవితఖైదు తప్పదని హెచ్చరించారు. కనీసం పదేళ్లకు తగ్గకుండా జైలుశిక్షలు ఉంటాలని స్పష్టంచేశారు. ఉన్నతస్థానానికి ఎదగాలన్న యువత కలలకు, ఆశయాలకు భంగం కలిగించే వ్యవహారాల పట్ల తమ ప్రభుత్వం ఎట్టి పరిస్తితుల్లోనూ రాజీ పడబోదని స్పష్టంచేశారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడినవారికి జైలు శిక్షలేకాకుండా వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.