సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (11:21 IST)

ఇనుపరాడ్ల దొంగతనానికి వెళ్లి పులి నోట్లో చిక్కి మృతి

tiger
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి ఇనుప రాడ్లు చోరీకి వెళ్లి పులి నోట్లో చిక్కుని మృత్యువాతపడ్డాడు. మృతుడిని మోహన్ నఫీస్‌గా గుర్తించారు. నైనీతాల్ జిల్లాలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు పక్కనే ఉండే ప్రాంతానికి చెందిన మోహన్... తన ఇద్దరు స్నేహితులతో కలిసి పాక్కుకు పక్కనే మద్యం సేవించాడు. ఆ తర్వాత అక్కడ పడివున్న ఇనుప రాడ్లను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. 
 
సరిగ్గా ఆ సమయంలో అక్కడకు వచ్చిన పులి కంట్లో పడ్డాడు. అంతే.. మోహన్‌పై దాడి చేసిన ఆ పులి.. అతన్నినోట కరచుకుని అడవిలోకి తీసుకెళ్లింది. వెంటనే ఇద్దరు యువకులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. 
 
అనంతరం గాలింపు చర్యలు చేపట్టిగా ఆదివారం ఉదయం రక్తపుమడుగులో పడివున్న నఫీస్ మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పులిని బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేశారు.