సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (17:17 IST)

మంట కలిసిన మానవ సంబంధాలు.. మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం

సమాజంలో మానవ సంబంధాలు మంటకలిసి పోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే తమ కుమార్తెలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మైనర్ బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. కుమార్తెను రేప్ చేస్తున్నప్పటికీ తల్లి కూడా మౌనంగా ఉండిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా, కాశీపూర్‌లో ఓ మైనర్ బాలికపై తండ్రి అత్యాచానికి పాల్పడ్డాడు. భార్యతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు రంగంలోకి దిగి ఈ దారుణానికి పాల్పడిన కన్నతండ్రితో పాటు భర్తకు సహకరించిన తల్లిని కూడా అరెస్టు చేశారు. దంపతులిద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
దీనిపై బాధితురాలు మాట్లాడుతూ, కన్నతండ్రి లైంగికంగా వేధించేవాడని, ఎంత చెప్పినా వినిపించుకోలేదని, తండ్రి వేధింపులను తల్లికి చెప్పగా ఆమె కూడా ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పినట్టు వెల్లడించింది.