గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (15:16 IST)

బ్రిటన్‌లో వారానికి నాలుగు రోజులు పని.. సక్సెస్

Work From Home
బ్రిటన్‌లో వారానికి నాలుగు రోజుల పని ట్రయల్ విజయవంతంగా ప్రకటించింది. బ్రిటన్‌లో గతేడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు వారానికి నాలుగు రోజుల పైలట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
 
దాదాపు 61 కంపెనీలు ఈ ట్రయల్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ట్రయల్ ముగింపులో ఈ కార్యక్రమం విజయవంతమైందని ప్రకటించారు. 
 
చాలా కంపెనీలు ఈ పద్ధతినే కొనసాగిస్తామని ప్రకటించాయి. పైలట్ కార్యక్రమం విజయవంతం కావడంతో దాదాపు 91 శాతం కంపెనీలు నాలుగు రోజుల పని కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తామని ప్రకటించాయి. 
 
కేవలం నాలుగు శాతం కంపెనీలు మాత్రమే ఈ ప్రణాళికను కొనసాగించబోమని ప్రకటించాయి. ఈ పరీక్ష ప్రోగ్రామ్‌కు సగటున 10కి 8.50 స్కోర్‌ను పొందారు. తద్వారా పరీక్ష ప్రోగ్రామ్ విజయవంతమైందని ప్రకటించబడింది.