1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (11:36 IST)

విక్టరీ వెంకటేష్ తొలి వెబ్ సిరీస్ "రానా నాయుడు" - మార్చి 10 నుంచి స్ట్రీమింగ్

rana naidu
విక్టరీ వెంకటేష్ నటించిన తొలి వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. దీనికి రానా నాయుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మార్చి పదో తేదీన నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్‌లో రానా దగ్గుబాటి కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్‌లో రానాకి తండ్రిగా వెంకటేష్ నటించారు. ఇంతవరకూ తెరపై కనిపించడానికి భిన్నంగా ఒక డిఫరెంట్ లుక్‌తో వెంకటేష్ కనిపించడం ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తి పంచేలా చేస్తుంది. 
 
ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ముంబై నేపథ్యంలో నడిచే కథ ఇది. ఏ సెలెబ్రిటీ ఆపదలో ఉన్నా అందరికంటే ముందుగా రానాకీ ఫోన్ కాల్ వస్తుంది. ఆ వెంటనే రంగంలోకి దిగిపోయే పాత్రలో ఆయన కనిపిస్తున్నారు. డబ్బు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిలు, రొమాన్స్, యాక్షన్ ఆయన జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కనిపిస్తున్నాయి. తండ్రి జైలు నుంచి రిలీజ్ అయితే, ఇంకో ఐదేళ్లు జైలులోనే ఉంటే బాగుండేదని కోరుకునే కొడుకుగా ఆయన పాత్ర ఇంట్రెస్టింగ్‌గా ఉంది. "వాడొక పాపు.. ఒక్క అవకాశం ఇచ్చినా నా ఫ్యామిలిని నాశనం చేస్తాడు" అే డైలాగ్‌తో మరింత క్యూరియాసిటీని పెంచేలా చేస్తుంది.
 
ఇకపోతే, "నా జీవితంలో చెడు చేసినా మంచి చేసినా అది నా ఫ్యామిలీ కోసమే చేశాను. కాకపోతే కలిసున్నది తక్కువ.. విడిపోయింది ఎక్కువ. అనే వెంకీ డైలాగ్‌తో ఆయన పాత్రలోని సంఘర్షణ  అర్థమవుతుంది. ముంబై నేపథ్యంలో ఒక వైపు కార్పొరేట్ అరాచకాలు, మరోవైపు తండ్రీ కొడుకుల మధ్య జరిగే పోరాటంగా ఈ కథ కనిపిస్తుంది. సుందర్ ఆరోనే నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు అన్షుమాన్ దర్శకత్వం వహించారు.