గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (13:57 IST)

ఆర్.సి. 15 షూటింగ్‌ లో రాంచరణ్ కోసం సింహాచలానికి తరలివచ్చిన జనం

Ramcharan
Ramcharan
శంకర్ దర్శకునిగా రాంచరణ్ నటిస్తున్న ఆర్.సి. 15 షూటింగ్‌  గత వారం హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ, ఆ తర్వాత  కర్నూలులోని కొండారెడ్డి బురుజులో షూటింగ్‌ జరిగింది. రామ్ చరణ్, శ్రీకాంత్, సముద్రఖని,శ్రీకాంత్‌లతో టాకీ పోర్షన్‌లను చిత్రీకరించిన శంకర్, ఆదివారం  షూటింగ్‌ని విశాఖపట్నంకు మార్చారు.
 
RC 15-vyzag
RC 15-vyzag
శంకర్ ప్రస్తుతం చరణ్, డ్యాన్సర్‌లతో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఆదివారం, సోమవారాల్లో గీతంలో ఓ  పాటను చిత్రీకరించారు, సముద్రం పక్కన ఎన్. టి. ఆర్. విగ్రహం సమీపంలో షూట్ చేశారు.  కాగా మంగళవారం చిత్రీకరణ సింహాచలానికి వెళ్ళింది. అక్కడ చరణ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. కృష్ణ చైతన్య, సత్య, ప్రియదర్శి  వెంకటేష్ కాకుమాను ఒక రోజు గీతంలో పాల్గొన్నారు.. బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ సాంగ్ కు  కొరియోగ్రఫీ చేస్తున్నారు, కథానాయిక కియారా అద్వానీ నటిస్తున్న ఈ పాటలో ఆమె పాల్గొనాల్సిన అవసరం లేదు. ఈ షెడ్యూల్‌కు బుధవారంతో  ముగించే అవకాశం ఉంది. తదుపరి షెడ్యూల్ మార్చిలో ప్రారంభమవుతుంది” అని తెలిసింది. 
 
Simhachalam temple
Simhachalam temple
ఇక సింహాచలంలో మెగా ఫాన్స్ టెంపుల్ పరిసరాల్లో సాంగ్ షూట్ కోసం చేసిన ఏర్పాట్లను షూట్ చేసి పోస్ట్ చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం, పొలిటికల్ డ్రామాగా రూపొందుతుంది. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.  తండ్రి, కొడుకుగా నటిస్తున్నాడు.  శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్ మరియు SJ సూర్య తదితరులు తారాగణం.