శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (14:51 IST)

నేను మనిషినే.. భర్త మ*** కోసి కుక్కకు విసిరేసిన భార్య..!

భర్తను చంపడమే కాకుండా అతని మర్మాంగాన్ని కోసి కుక్కకు వేసిన ఘటన ఉక్రెయిన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌కు చెందిన ఒబారివ్ అనే గ్రామంలో ఒలెంగ్జాడర్ కుటుంబం వుంది. ఆగస్టు నెల 25వ తేదీ రాత్రి పనిని ముగించుకుని ఇంటికొచ్చి ఒలెగ్జాండర్.. దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ విచారణలో పోలీసులకు షాకిచ్చే.. గగుర్పాటు కలిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన ఒలెగ్జాండర్ భార్య మరియా వద్ద పోలీసులు విచారణ జరిపారు. భర్త కొన్నేళ్ల పాటు తనను చిత్రహింసలకు గురిచేశాడని.. ఆ తంతు ఏమాత్రం తగ్గలేదని.. తానూ మనిషినేనని.. సహనం కోల్పోవడంతో భర్తను చంపేశానని చెప్పుకొచ్చింది. 
 
అందుకే పని ముగించుకుని ఇంటికొచ్చి నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి చంపేసానని.. అయినా తన ఆవేశం తగ్గకపోవడంతో అతని మర్మాంగాన్ని కత్తిరించి బయట నిల్చున్న కుక్కలకు విసిరేశానని చెప్పింది. 
 
ఆ సమయంలో చేతిలో రక్తపు మరకలతో కనిపించిన మరియాను తాము చూసినట్లు స్థానికులు తెలిపారు. అంతేగాకుండా ప్రతిరోజూ మరియాను ఆమె భర్త తీవ్రంగా హింసించేవాడని.. దీన్ని కూడా చూశామని స్థానికులు చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఇక ఈ కేసులో మరియా నిందితురాలని తేలితే 15 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని అధికారులు చెప్పారు.