సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2016 (10:49 IST)

భారతీయులకు గట్టి షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్.. హెచ్‌-1బీ వీసాలపై?

భారతీయులకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు. హెచ్‌-1బీ వీసాలపై అమెరికాకు వెళ్తున్న, వెళ్లనున్న భారతీయులకు గట్టి షాక్ ఇచ్చారు. అమెరికన్ల ఉద్యోగాలను వారికి ఇచ్చేందుకు ఆయా సంస్థలను అన

భారతీయులకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు. హెచ్‌-1బీ వీసాలపై అమెరికాకు వెళ్తున్న, వెళ్లనున్న భారతీయులకు గట్టి షాక్ ఇచ్చారు. అమెరికన్ల ఉద్యోగాలను వారికి ఇచ్చేందుకు ఆయా సంస్థలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అమెరికన్లను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులకు అవకాశమివ్వడాన్ని అంగీకరించబోమని తెలిపారు.
 
ప్రతి అమెరికన్‌ జీవితాన్ని పరిరక్షించేందుకు తాము పోరాడతామని ట్రంప్ వెల్లడించారు. డిస్నీ వరల్డ్‌, అమెరికన్‌ ఐటీ కంపెనీ హెచ్‌-1బీ వీసాలపై విదేశీ నిపుణులను అమెరికాకు తీసుకొచ్చి.. అమెరికన్‌ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కూర్చోబెడుతున్నారని ఎన్నికల ప్రచార సమయంలో ఆయన పెద్దఎత్తున విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.