కీరవాణి ఇంటర్వ్యూ : 'దిక్కులు చూడకు రామయ్య'పై కామెంట్స్..

మంగళవారం, 7 అక్టోబరు 2014 (16:40 IST)
'దిక్కులు చూడకు రామయ్య' చిత్రానికి సంగీతం సమకూర్చిన ఎంఎం కీరవాణి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇతర సంగీత దర్శకుల గురించి వ్యాఖ్యానించడం నా అభిమతం కాదు. ఎవరిష్టం వచ్చినవాళ్లతో వాళ్లు పాడించుకుంటారు. బేసిక్‌గా నాకు తెలుగువాళ్లతో పాడించడం ఇష్టం. ఇప్పుడీ చిత్రంలోని పాటలన్నీ పాడింది తెలుగు గాయనీ గాయకులే. ఫలానా సింగర్ పాడితేనే బాగుంటుందని నాకనిపించే ఏకైక గాయకుడు ‘బాలుగారు’. ఆయన కోసం మాత్రమే ఆగిన సందర్భాలున్నాయి’ అని కీరవాణి చెప్పారు.
  
కాగా, త్రికోటి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’ ఈ శుక్రవారం విడుదల కానుంది. నా కెరీర్ ఆరంభం నుంచి అవసరాన్ని బట్టి పెద్ద, చిన్న సినిమాలు చేస్తున్నాను. నాకు చిన్నా, పెద్దా అనే వ్యత్యాసం నాకు లేదన్నారు. అందువల్లే ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాకి ఏం అవసరమో ఆ పరిధిలో ఒదిగిపోయి చేశాను.
 
'ఈగ'లో సుదీప్ నటన నాకు బాగా నచ్చిందని, ఈ చిత్రంలో అజయ్ నటన అంతకంటే బాగా నచ్చిందని చెప్పారు. సాయి కొర్రపాటితో ‘ఈగ’ సమయంలోనే నాకు మంచి అవగాహన ఏర్పడింది. ఏ నిర్మాత అయినా నన్ను నమ్మితే నేను సౌకర్యవంతంగా సినిమా చేస్తానని చెప్పారు. సాయి కొర్రపాటి కూడా ఆ కోవకు చెందిన నిర్మాతే అని వివరించారు.  

అన్నీ చూడండి

కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్ట

హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?

ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు

అన్నీ చూడండి

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

పిస్తా పప్పులు ఎందుకు తినాలి?

యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు

కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?

వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...

Show comments