Dharma Sangrah
✕

విలువలు పాటించే అమ్మాయిని నేను : నభా నటేశ్‌

Written By డీవీ
Updated: సోమవారం, 21 డిశెంబరు 2020 (19:44 IST)
నేను విలువు పాటించే అమ్యాయిన‌ని.. న‌భా న‌టేశ్ అంటోంది. "ఇస్మార్ట్‌ శంకర్‌"లో మాస్‌ పాత్ర చేసిన ఆమె ఎటువంటి విలువ‌లు పాటించిందో తెలియాలంటే.. ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’. చూడాల్సిందే అని చెబుతోంది. సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రంలో నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌ 25న విడుద‌లవుతుంది. ఈ సందర్భంగా వెబినార్‌లో హీరోయిన్‌ నభా నటేశ్ మాట్లాడారు. ఆ వివ‌రాలు.. వెబ్‌దునియా ప్రేక్ష‌కుల కోసం.
 
* షూటింగ్‌లో ఎటువంటి స‌పోర్ట్ ల‌భించింది? 
తేజ్‌ నాకు చాలా మంచి ఫ్రెండ్‌.. సపోర్టర్‌. టీమ్‌ అందరూ చాలా ఆతృతతో, ఏదో సాధించాలనే తపనతో పనిచేశారు. మా దర్శకుడు సుబ్బుకి ఇది ఫస్ట్ సినిమా. చాలా హ్యాపీగా అనిపించింది. యంగ్‌ టీమ్‌తో పాటు సినిమాలో రాజేంద్రప్రసాద్‌, నరేష్... లాంటి సీనియర్‌ స్టార్స్‌ కూడా ఉన్నారు. 
 
* ఇందులోని పాట‌ల‌కు ఎటువంటి స్పంద‌న వ‌చ్చింది? 
త‌మ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. పాటలు చాలా పాపులర్‌ అయ్యాయి. ప్రజలకు చాలా నచ్చాయి. ఆల్బమ్‌ మొత్తం చాలా పెద్ద హిట్‌ అయింది. లాక్డౌన్‌లో ఒకదాని తర్వాత ఒక పాటను విడుదల చేశాం. నో పెళ్లి, ఆ తర్వాత హే ఇది నేనేనా... విడుదల  చేశాం. విన్నవాళ్లందరూ బావుందంటున్నారు. ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది.
 
* ఓటీటీ నుంచి థియేట‌ర్‌కు వ‌స్తున్న ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? 
సినిమాను ఓటీటీలో చూడటానికి, టిక్కెట్స్‌ కొని థియేటర్స్‌లో బిగ్‌ స్క్రీన్‌పై చూడటానికి చాలా తేడా ఉంటుంది. డిసెంబర్‌ 25న విడుదలవుతున్న మా సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమాను థియేటర్‌లో ప్రేక్షకులు ఎలా ఎంజాయ్‌ చేస్తారని నాకు కూడా ఆసక్తి ఉంది. కోవిడ్‌ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని అన్నారు. కాస్త టెన్షన్‌గా అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ. థియేటర్‌లోకి వస్తే బావుటుంది అనుకున్నాను. అయితే పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరూ ఏమీ చేయలేం కదా అనిపించింది. అయితే ఈలోపు థియేటర్స్ ఓపెన్‌ కావడమూ, మా మేకర్స్‌ సినిమాను థియేటర్‌లో విడుదల చేయడానికి ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. 
 
* ఇందులో ఎలాంటి అమ్మాయిగా క‌నిపిస్తారు? 
సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. రేపు సినిమా విడుదలైన తర్వాత నేను ఎందుకు ఇలా చెప్పానో మీకే అర్థమవుతుంది. సినిమా విడుదలైన తర్వాత నా పాత్ర గురించి మాట్లాడుతాను. కొన్ని విలువలు పాటించే అమ్మాయి పాత్రలో కనపడతాను. నా పాత్రను డైరెక్టర్‌ సుబ్బు ఎంటర్‌టైనింగ్‌గా మలిచారు. సుబ్బు నాకు పాత్రను నెరేట్‌ చేశాడు. తన నెరేషన్‌, నా పాత్రను మలిచిన తీరు నచ్చడంతో నేను వెంటనే ఓకే చెప్పేశాను. 
 
* ఈ పాత్ర చేయ‌డంలో ఇబ్బంది ప‌డ్డారా? 
ఇస్మార్ట్‌ శంకర్‌లో మాస్‌ పాత్ర చేశాను. ఇందులో క్లాస్‌ అమ్మాయిగా నటించాను. ప‌క్కింటి అమ్మాయి పాత్ర. పాత్ర క్యారీ చేయడంలో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేను దక్షిణాది అమ్మాయిని. మన సినిమాలే చూస్తూ పెరిగాను. థియేటర్స్‌లో యాక్ట్‌ చేశాను. నాటకాల్లో నటించాను. కాబట్టి పాత్రలో ట్రాన్స్‌ఫార్మ్‌ కావడం నాకు కష్టమేమీ కాదు. నటిగా నేను డైరెక్టర్‌ చెప్పింది చేసుకుంటూ వెళతాను. సినిమా సక్సెస్‌ అయితే, నాకు పేరొస్తుందని నమ్ముతాను. కష్టపడటమే తెలుసు. అని ముగించారు. 

అన్నీ చూడండి

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఈడీ కేసు.. త్వరతగతిన పరిష్కరించాలని పిటిషన్

Hyderabad: యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

Cyclone Akvan: ఒడిశా అంతటా 70 CoW యూనిట్లు, 197 మొబైల్ DG సెట్ల మోహరింపు

దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు గ్యాంగ్‌స్టర్ నసీమ్ దుర్రానీ హతం

నేడు ఒరిస్సా గోపాల్ పూర్‌లో తీరందాటనున్న అక్వాన్ తుఫాను

అన్నీ చూడండి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?

ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?

తర్వాతి కథనం
Show comments