అతడిని మార్చాలనుకున్నా... మార్చేశా అంతే..: రెజీనా ఇంటర్వ్యూ

వరుసగా రెండుమూడు సినిమాలు ఒకే హీరోతో చేస్తే.. వారితో తాటాకులు కట్టేస్తున్నారనీ, ఇవన్నీ విని నవ్వొస్తుందని నటి రెజీనా అంటోంది. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌.. చిత్రాల్లో నటించినంత మాత్రాన సాయిధరమ్‌ తేజ్‌తో లవ్‌, ఆ తర్వాత బ్రేకప్‌ అ

గురువారం, 25 ఆగస్టు 2016 (19:25 IST)
వరుసగా రెండుమూడు సినిమాలు ఒకే హీరోతో చేస్తే.. వారితో తాటాకులు కట్టేస్తున్నారనీ, ఇవన్నీ విని నవ్వొస్తుందని నటి రెజీనా అంటోంది. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌.. చిత్రాల్లో నటించినంత మాత్రాన సాయిధరమ్‌ తేజ్‌తో లవ్‌, ఆ తర్వాత బ్రేకప్‌ అయిందా? అని అడగడం ఆశ్చర్యంగా వుందని, మా ఇద్దరిమధ్య అలాంటిది ఏమీ లేదనీ, మంచి స్నేహితులమని తేల్చిచెప్పింది. తాజాగా ఆమె 'జో అచ్యుతానంద' సినిమాలో నటించింది. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ.. పైవిధంగా స్పందించింది.
 
అవసరాల శ్రీనివాస్‌ కథ విన్నప్పుడు ఎలా అనిపించింది?
తెలుగు రంగంలో ఇలాంటి కథలు రాయడంలో బెస్ట్‌ దర్శకులున్నారు. వారిలో అవసరాల శ్రీనివాస్‌ ఒకరని చెప్పవచ్చు. తను సీన్లు వివరించే విధానం చాలా సరదాగా వుంది. సీన్లు చదివేటప్పుడే నవ్వుతూ వున్నారు. ట్రైలర్‌ చూశాక మరింత నమ్మకం పెరిగింది. ఇందులో నా పాత్రలో అన్ని ఎమోషన్స్‌ వుంటాయి. పక్కింటి అమ్మాయిగా కన్పిస్తాను. డెంటిస్ట్‌గా చేశాను. పాత్రలో సానుభూతి, కోపం, నవ్వు, అన్నీ ఎమోషన్స్‌ కన్పిస్తాయి.
 
నారా రోహిత్‌తో నటించడం ఎలా అనిపించింది?
తనతో 'శంకర' చిత్రంలో చేశాను. మంచి స్నేహితుడు. ఈ చిత్రం చేసేటప్పుడు తమిళ సినిమా చేస్తున్నా. ఒక రోజు ఇక్కడ మరో రోజు చెన్నై.. ఇలా జర్నీ చేశాను. ఈ చిత్రం చేస్తున్నంతసేపు పిక్‌నిక్‌లా అనిపించింది. చాలా సినిమాలకు అలా చెబుతారు. ఇది కరెక్ట్‌గా సరిపోయింది.
 
లిప్‌లాక్స్‌ వున్నాయా?
ఈ సినిమాలో లేవు. 
 
'ఆంఖే-2' సినిమాలో డ్రెస్‌ గురించి గొడవ జరిగిందనే వార్తలు వచ్చాయి?
ఎవరు చెప్పారు... అలాంటిది లేదు. నా సినిమాలు కొన్ని చూశాక.. నన్ను ఆ సినిమాకు పిలిచారు. నన్ను చూశాక. ఫొటో షూట్‌ చేశారు. అక్కడ ట్రెడిషనల్‌ వుండదు. గ్లామరే వుంటుంది. అంటే ఎక్స్‌పోజింగ్‌ మాత్రంకాదు. అందులో నేను చేసే పాత్ర కోసం రిహార్సల్స్‌ కూడా చేశాను. నాతో పాటు అమితాబ్‌ మిగతా నటులుగా కూడా చేశారు. సీనియర్‌ నటుడు చేయడంతో ఆయన డెడికేషన్‌ అర్థమయింది. అమితాబ్‌తో కలిసి యాక్ట్‌ చేయడం మొమరబుల్‌గా అనిపిస్తుంది.
 
ఇలియానా మీ పేరు ప్రతిపాదించారా?
ఎవ్వరూ ప్రతిపాదించలేదు. నేను గాసిప్‌ వార్తలు చూడను.
 
గ్లామర్‌కు కష్టపడాలా?
బాలీవుడ్‌లో సన్నగా వుండాలి. దక్షిణాదిలో లావుగా వుండాలి. అక్కడ అంతా ప్రొఫిషనల్‌గా వుంటారు. అన్నీ ప్రోపర్‌గా వుంటాయి. పలానా టైమ్‌కు రావాలంటే రావాలి.
 
దక్షిణాది నటీమణులకు బాలీవుడ్‌లో ఎలా స్వీకరిస్తారు?
బాగానే చూస్తారు. మనం ఎలా వెళుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సౌత్‌ టెక్నీషియన్‌ అంటే చాలా గౌరవం వుంటుంది. అక్కడ చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళినవారే వున్నారు.
 
సాయిధరమ్‌తో బ్రేకప్‌ అయిందా?
మేమిద్దరం కలిసి పిల్లా నువ్వులేనిజీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ చేశాం. రెండు సినిమాలు చేస్తే ఏదో వుందని అందరూ అన్నారు. మరిప్పుడు ఇద్దరం కలిసి చేయకపోవడం వల్ల మాకు బ్రేకప్‌ అయిందని అంటున్నారు. అసలు మా మధ్య ఏమైనా వుంటే కదా! బ్రేకప్‌ అవ్వడానికి. మేము మంచి ఫ్రెండ్స్‌. రూమర్స్‌ మీరే రాసేసుకున్నారు. పెండ్లి అయింది బ్రేకప్‌ అయిందనీ.. ఇవన్నీ మీరు రాసుకుని ప్రశ్నలు అడిగితే ఎలా!
 
సాయిధరమ్‌ తేజ్‌తో మళ్ళీ నటిస్తున్నారా?
ఇప్పుడేమీ చెప్పలేం. నేను వేరే సినిమాల్లో బిజీగా వున్నా.
 
మీ మేనేజర్‌ను మార్చారు. కారణం?
ఏమీలేదు. మార్చాలనిపించింది. మార్చేశాం.

అన్నీ చూడండి

త్వరలోనే ఏఐ ఆధారిత వైద్య సేవలు.. చంద్రబాబు నాయుడు

వైకాపా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే .. 11 అరాచకాలు ఇవిగోండి : సీఎం చంద్రబాబు ధ్వజం

అయ్యా సీఎం విజయ్ నీ ఉచిత కరెంట్ మాకొద్దు, డబ్బులిస్తాం ఇవ్వు నాయనా: తమిళనాడులో మొదలైన అసంతృప్తి, వీడియో

తెలంగాణలో తీవ్ర వడగాలులు-16మంది మృతి: పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మాసాబ్ ట్యాంక్‌లో దారుణం : న్యాయవాదిను కారుతో ఢీకొట్టించి చంపేశారు...

అన్నీ చూడండి

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

తర్వాతి కథనం
Show comments