శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (12:42 IST)

ఐపీఎల్10లోనూ ఫిక్సింగ్.. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను బుకీలు కలిశారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో మళ్లీ ఫిక్సింగ్ దుమారం రేగింది. ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో.. గుజరాత్ లయన్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు గుర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో మళ్లీ ఫిక్సింగ్ దుమారం రేగింది. ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో.. గుజరాత్ లయన్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని పోలీసులు గుర్తించి, బీసీసీఐకి సమాచారం ఇచ్చారు. కాన్పూర్‌లోని ఓ హోటల్‌లో ముగ్గురు బుకీలు వచ్చి ఆటగాళ్లను కలుసుకున్నారని పోలీసులు బీసీసీఐ తెలిపారు. 
 
ఇంకా ఆ బుకీలను అరెస్ట్ చేశామని, వారి నుంచి రూ. 40 లక్షలు ప్లేయర్లకు అందాయని పోలీసులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ముగ్గురు బుకీల వద్ద విచారణ వేగవంతం చేశామని.. వారివద్ద మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నామని బీసీసీఐ పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకూ ఆటగాళ్ల పేర్లను బయటకు వెల్లడించబోమని బీసీసీఐ వెల్లడించింది.