Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ ఐదు రోజుల మెగా మేళా...

ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఐదు రోజుల పాటు మెగా మేళా ప్రకటించింది. ఉచితంగా సిమ్‌తో పాటు డేటాను అందిస్తూ, సోమవారం నుంచి ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక మేళాను నిర్వహించనుందని తెల

Written By Selvi
Updated: ఆదివారం, 22 అక్టోబరు 2017 (10:37 IST)
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఐదు రోజుల పాటు మెగా మేళా ప్రకటించింది. ఉచితంగా సిమ్‌తో పాటు డేటాను అందిస్తూ, సోమవారం నుంచి ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక మేళాను నిర్వహించనుందని తెలంగాణ టెలికాం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అనంతరామ్‌ వెల్లడించారు. ఈ మేళాలో భాగంగా, 3జీ స్మార్ట్ సిమ్‌ను, 350 మెగాబైట్ల డేటాను ఫ్రీగా అందిస్తామని తెలిపారు. 
 
రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 27వ తేదీ వరకూ మెగా మేళా జరుగుతుందని అనంతరామ్ రామ్ చెప్పారు. ఇదే సమయంలో ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లను కూడా కస్టమర్లు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 18001801503 నంబరుకు కాల్ చేయాలని తెలిపారు.
 
ఇప్పటికే.. రిలయన్స్ జియో 4జీ ఫోన్లు పూర్తిగా జనాల చేతుల్లోకి రాకముందే బీఎస్ఎన్ఎల్ 4జీ ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసి జియోకు భారీ షాకిచ్చింది. దేశీయ మొబైల్ మేకర్ మైక్రోమ్యాక్స్‌తో కలిసి "భారత్ 1" పేరుతో 4జీ ఫీచర్‌ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర రూ.2200. ''భారత్ 1''లో నగదు లావాదేవీల కోసం ''భీమ్'' యాప్‌ను పొందుపరిచారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments