Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెటిజన్లకు బ్యాడ్‌న్యూస్.. పొద్దస్తమానం ఇంటర్నెట్‌ ఉపయోగిస్తే...

హైటెక్ ప్రపంచం.. చేతిలో స్మార్ట్‌ఫోన్. ఇంకేముంది.. పొద్దస్తమానం ఇంటర్నెట్ ప్రపంచంలో యువత మునిగితేలుతోంది. అన్నపానీయాలు, నిద్రహారాలు మానేసి నెట్టిల్లే లోకంగా జీవిస్తోంది. ఇలా పొద్దస్తమానం ఇంటర్నెట్ ఉపయ

Written By pnr
Updated: శుక్రవారం, 4 ఆగస్టు 2017 (16:46 IST)
హైటెక్ ప్రపంచం.. చేతిలో స్మార్ట్‌ఫోన్. ఇంకేముంది.. పొద్దస్తమానం ఇంటర్నెట్ ప్రపంచంలో యువత మునిగితేలుతోంది. అన్నపానీయాలు, నిద్రహారాలు మానేసి నెట్టిల్లే లోకంగా జీవిస్తోంది. ఇలా పొద్దస్తమానం ఇంటర్నెట్ ఉపయోగించే వారికి ఓ బ్యాడ్ న్యూస్ చెప్పారు నెట్ పరిశోధకులు. తాజాగా వెల్లడైన ఈ పరిశోధనా ఫలితాలను పరిశీలిస్తే... 
 
రోజులో ఎక్కువ సమయం ఇంటర్నెట్ ఉపయోగించే 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కొంతమందిని ఎంపిక చేసుకుని ఇంటర్నెట్ వాడమని చెప్పారు. ఆ తర్వాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. వీరిలో రక్తపోటు, హృదయ స్పందనల్లో మార్పులను గుర్తించారు. ఇదంతా ఇంటర్నెట్‌ ప్రభావమేనని వారు అంటున్నారు. 
 
ఇంటర్నెట్‌ను ఎంత ఎక్కువ సేపు ఉపయోగిస్తే అంత ఎక్కువగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఇంటర్నెట్‌ను ఏకబిగువునకాకుండా మధ్యలో కొద్దిసేపు విరామం ఇచ్చే వారిలో ఈ ముప్పు కాస్త తక్కువగా ఉందని తెలిపారు. మొత్తంమీద గంటా లేదా రెండు గంటల కన్నా ఎక్కువ సేపు ఇంటర్నెట్‌ను చూడటం ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Screenplay Master' book: స్క్రీన్ ప్లే మాస్టర్ - సుకుమార్ పుస్తకం ఆవిష్కరణ

వైభవోపేతంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 10: తొలి అవతారంగా మహాపరీక్షను ప్రకటించిన నాగార్జున

Ranbali: విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా రణబాలి టీజర్ డేట్ ఫిక్స్

Priyadarshi : ప్రియదర్శి చిత్రం ఇడుపు కాయితం నుంచి శ్రీలత. సాంగ్ రాబోతోంది

Akhil Akkineni: ఆయన సినిమాలో నేను కూడా భాగం కావాలి : అఖిల్ అక్కినేని

తర్వాతి కథనం
Show comments