శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (18:45 IST)

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ల విలీనం.. కేబినేట్ కీలక నిర్ణయాలు

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లు ఏకం కానున్నాయి. ఈ మేరకు ఈ రెండు కంపెనీలను గట్టెక్కించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రెండు సంస్థలను విలీనం చేసే దిశగా కేబినేట్ తీర్మానించింది. 
 
ఇంకా బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లను మూసివేయబోమని కేంద్ర మంత్రి రవిశంకర్‌ తెలిపారు. ఆ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉండబోదని స్పష్టం చేశారు. ఈ సంస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయించడంతో పాటు రూ. 15వేల కోట్ల సావరీన్‌ బాండ్స్‌ జారీచేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రెండు సంస్థల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు. 
 
కేంద్ర కేబినెట్ బుధవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని అక్రమ కాలనీలను రెగ్యులరైజ్ చేస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఢిల్లీలోని నివసిస్తున్న 40 లక్షల మందికి నేరుగా ప్రయోజనం చేకూరనుంది.