Daily Horoscope
✕

హార్డ్‌వేర్ ఇంజనీర్లను చుక్కలు చూపుతున్న గూగుల్..

Written By మోహన్
Updated: గురువారం, 14 మార్చి 2019 (17:44 IST)
గూగుల్ సంస్థలో పనిచేసే హార్డ్‌వేర్ ఇంజనీర్‌లకు గడ్డుకాలమేనట. ఈ విషయాన్ని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ పత్రిక వెల్లడించింది. గూగుల్ సంస్థ తన ల్యాప్‌టాప్, టాబ్లెట్ విభాగాల్లో పనిచేసే హార్డ్‌వేర్ ఇంజనీర్‌లను ఇతర విభాగాల్లోకి మార్చేయనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థే వారికి కూడా వెల్లడించింది. దీని వలన గూగుల్ హార్డ్‌వేర్ వ్యాపారంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. 
 
గూగుల్ సంస్థ క్రియేట్ బృందాన్ని తగ్గించుకోవడం కోసం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ బృందం పిక్సెల్ బుక్ ల్యాప్‌టాప్, పిక్సెల్ స్లేట్ టాబ్లెట్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తోంది. 
 
ఈ బృందంతో పాటుగా మిగిలిన హార్డ్‌వేర్ బృందాలు సైతం పిక్సల్‌ స్మార్ట్‌ఫోన్లను, హోమ్‌ స్మార్ట్‌ స్పీకర్లను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం వ్యాపారంలోని కొన్ని విభాగాలను తగ్గించుకునే యోచనలో గూగుల్ ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిపై గూగుల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అన్నీ చూడండి

'ఆదర్శ కుటుంబం' విడుదల తేదీ ఖరారు : వెల్లడించిన మేకర్స్

జైలర్‌పై అభిమానం - థియేటర్ మొత్తం బుక్ చేసిన క్రికెటర్ సంజూ శాంసన్

'వారణాసి' చిత్రం ఓ అందమైన ప్రేమకథ : ఎస్ఎస్ రాజమౌళి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్.. సంబరాల ఏటి గట్టు షూటింగ్ పూర్తి

Nivetha Pethuraj : వెంకటేష్, నివేదా పేతురాజ్‌పై మాలా.. పాట చిత్రీకరణ

తర్వాతి కథనం